realme1

Wednesday, November 1, 2017

why u r phone battery getting down fastely?

స్మార్ట్ ఫోన్ లో ప్రమాదకరమైన అప్లికేషన్ల జాబితా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. Apps, గేమ్స్ లో మాల్వేర్ (malware )లు, ఇతర ప్రమాదకరమైన అంశాలను జొప్పించి గూగుల్ కన్నుగప్పి చలామణి చేసే సందర్భాలను గతంలో పలుమార్లు విన్నాం.

అయితే తాజాగా మరో సరికొత్త వరవడి ప్రారంభమైంది. మనకు ఏమాత్రం అనుమానం రాకుండా మన smartphoneని Bitcoin వంటి  మైనింగ్ చెయ్యడానికి అనేక apps దొడ్డిదారిన ప్రయత్నిస్తున్నాయి. ఆయా appsని ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనకు ఏమాత్రం సందేహం రాకుండా అవి మామూలుగానే పనిచేస్తుంటాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ లో రహస్యంగా బిట్ కాయిన్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం మన ఫోన్ లోని ప్రాసెసర్ నిరంతరం పూర్తి లోడ్‌తో పనిచేస్తుంటుంది. దీంతో పరోక్షంగా ఫోన్ వేడెక్కటం తో పాటు బ్యాటరీ ఊరికినే ఖర్చవుతూ ఉంటుంది.

ఇలా Bitcoin miningకి పాల్పడుతున్న పలు appsని Trend Micro అనే సెక్యూరిటీ సంస్థ గుర్తించి గూగుల్ ప్లేస్టోర్‌కి రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం ఆయా appsని Google సంస్థ Play Store నుండి తొలగించింది. Cryptocurrency మైనింగ్ కోసం యూజర్ల phone, computerలను అనధికారికంగా దుర్వినియోగం చేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. కొన్ని torrent search engineలు కూడా తమ websiteలకు వచ్చే సందర్శకుల కంప్యూటర్లని bitcoin మైనింగ్ కోసం వాడడం మొదలుపెట్టాయి.

కొంతమంది app డెవలపర్లు అయితే.. బాగా పాపులర్ apps యొక్క apk ఫైళ్లని డీఅసెంబుల్ చేసి Bitcoin miningకి సంబంధించి జావాస్క్రిప్ట్ కోడ్‌ని అదనంగా చేర్చి వేరే పేర్లతో Google Play Storeలోకి అప్‌లోడ్ చేస్తున్నారు.
mana vasavi maata

No comments:

Post a Comment